- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
by Ratna Kumari |
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బాపనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, దామరగిద్ద : విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బాపనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపనపల్లి గ్రామానికి చెందిన బుడ్డ పోలనారాయణ తన పొలం వద్ద వరి అంచులు చేస్తున్న సమయంలో సర్వీస్ వైర్ జాయింట్ కావడానికి గమనించి సరిచేసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ అయి రైతు గిలగిల కొట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అతన్ని చూసి వెంటనే పక్కనున్న రైతులు విద్యుత్ ఫీజులు తీసి విద్యుత్ లైన్ నిలుపుదల చేసి రక్షించాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే మృతి చెందాడు. నారాయణకు ఒక భార్య, కుమారుడు ఉన్నాడు. ఇంటికి పెద్ద దిక్కు అయినా నారాయణ మరణించడంతో కుటుంబ పరిస్థితి అయోమయంలో పడింది.
Next Story






