ఆరు వారాల్లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ ఖ‌ర్చుల లెక్క ఇవ్వ‌కుంటే వేటు త‌ప్ప‌దు

by Ratna Kumari |

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థులు రోజు వారిగా ఖ‌ర్చు చేసిన వివ‌రాల‌ను ఆరు వారాల్లో ఇవ్వ‌కుంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా ఎన్నిక‌ల ఖ‌ర్చుల నివేదిక అధికారి విజ‌య్ కుమార్ తెలిపారు.

ఆరు వారాల్లో  మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ ఖ‌ర్చుల లెక్క ఇవ్వ‌కుంటే వేటు త‌ప్ప‌దు
X

దిశ‌, మ‌క్త‌ల్ : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థులు రోజు వారిగా ఖ‌ర్చు చేసిన వివ‌రాల‌ను ఆరు వారాల్లో ఇవ్వ‌కుంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా ఎన్నిక‌ల ఖ‌ర్చుల నివేదిక అధికారి విజ‌య్ కుమార్ తెలిపారు. బుధ‌వారం మున్సిప‌ల్ కార్యాల‌యంలో శ్రీరామ్ ఆధ్వ‌ర్యంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప్ర‌తి అభ్య‌ర్థి ప్ర‌త్యేకంగా ఖ‌ర్చుల కోసం బ్యాంకు ఖాతా ఓపెన్ చేశార‌ని.. అందులో రోజు వారిగా నిర్వ‌హించిన లావాదేవీలు న‌మోదు వివ‌రాలు ఉండాల‌ని సూచించారు. వివరాలను మున్సిపల్ కార్యాలయానికి ఆరు వారాల్లో స‌బ్ మిట్ చేయాలని, ప్రతి అభ్యర్థికి కేటాయించిన లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే చర్యలు ఉంటాయని.. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏడు రోజుల వరకు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ఖర్చు చేయాలన్నారు. వాటి వివరాలను రిసీప్టులతో సహా మున్సిపల్ ఎన్నికల కమిషన్ కి సమర్పించాలని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అవగాహన కల్పించారు.

Next Story