క్వారీల్లో పేలుళ్లు.. రైతుల ధర్నా

by Nallavelli.Anjaneyulu |

కంకర క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ గా పేలుడు పదార్థాలను బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు క్వారీ ముందు ధర్నా చేశారు.

క్వారీల్లో పేలుళ్లు.. రైతుల ధర్నా
X

దిశ, మిడ్జిల్ : కంకర క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ గా పేలుడు పదార్థాలను బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు క్వారీ ముందు ధర్నా చేశారు. మంగళవారం మండలం చేదుగట్టు తండ సమీపంలో కంకర క్వారీల నుంచి వెలువడే పేలుడు పదార్థాల వల్ల దుమ్ము, ధూళి కారణంగా చుట్టుపక్కల కిలోమీటరు మేర పంటలు , సమీపంలో ఇండ్లు దెబ్బతింటున్నాయని రైతులకు ఆందోళన చేశారు. బైరంపల్లి, చేదుగట్టు తాండ, కంచనపల్లి గ్రామాల్లోనూ క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము వల్ల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. గ్రామాల మధ్య కంకర క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ గా పేలుడు పదార్థాలను బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పేలుళ్ల సమయంలో రాళ్లు పొలాల్లో పడుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొలాలకు వెళుతున్నామని అన్నారు. పేలుడు పదార్థాల వల్ల దుమ్ము ధూళితో పంటలు కూడా దెబ్బతిని భారీగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ శివప్రసాద్ రైతులతో మాట్లాడారు. రైతుల ఫిర్యాదు మేరకు క్వారీని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

Next Story