- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్ట్ కుటుంబాలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయండి
ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లోని రఘురామయ్య ఆడిటోరియంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగర మేయర్, డిఫ్యూటీ మేయర్ లకు జరిపే సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలబడాలంటే మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత అత్యంత అవసరమని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారే జర్నలిస్టులని, వారి సేవలు అమూల్యమైనవని ఆయన కొనియాడారు. గ్రామీణ, పట్టణ స్థాయిలోనూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతను జర్నలిస్టు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. జర్నలిస్టులకు ఇళ్ల, ఆరోగ్య భీమా, గుర్తింపు కార్డులు, ఫించన్ వంటి అనేక సంక్షేమ అంశాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వాటిని ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోవాలని, ఆ నిధికి ప్రతినెలా లక్ష రూపాయలు సహాయాన్ని అందిస్తానని ఎమ్మెల్యే 'యెన్నం' హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు మీ పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని, మీడియా-ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండడంవలన ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. డిఫ్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో తాను జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు తీపి కబురు చెబుతానని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మేయర్ మమత, డిఫ్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి లను ఘనంగా సత్కరించారు. తర్వాత నూతన సంవత్సర డైరీ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వాకిటి అశోక్ కుమార్, ఆశన్న ముదిరాజ్, బస్వరాజ్, నర్సింహులు, గోపాల్, రమాకాంత్ రెడ్డి, యాదయ్య, ప్రభాకర్, కార్పోరేటర్ తిరుమల వెంకటేష్, దేవ్లీ మేగ్యా నాయక్, రమేష్ రెడ్డి, మైత్రి యాదయ్య పాల్గొన్నారు.






