ఎర్రవెల్లి పోరాటం న్యాయమైంది : రాంబాల్ నాయ‌క్

by Ratna Kumari |

దిశ, చారకొండ : గ‌త కొద్ది రోజులుగా ఎర్ర‌వ‌ల్లి గ్రామ‌స్తులు రిలే నిర‌హార దీక్ష‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. శ‌నివారం ఎర్రవల్లి గ్రామస్థు

ఎర్రవెల్లి పోరాటం న్యాయమైంది :  రాంబాల్ నాయ‌క్
X

దిశ, చారకొండ : గ‌త కొద్ది రోజులుగా ఎర్ర‌వ‌ల్లి గ్రామ‌స్తులు రిలే నిర‌హార దీక్ష‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. శ‌నివారం ఎర్రవల్లి గ్రామస్థుల రీలే నిరాహార దీక్షలను తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ , ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్ నాయక్ , నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దేవిలాల్ చౌహాన్, కల్వకుర్తి అధ్యక్షుడు జుమ్లా నాయక్, చారకొండ మండల అధ్యక్షుడు సాయి కుమార్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ మాట్లాడుతూ ... రిజర్వాయర్ సర్వేలో అనేక అనుమానాలు ఉన్నాయని, ఎర్రవల్లికి న్యాయం జరిగేంత‌ వరకు బాధితుల కు అండగా ఉంటామన్నారు. న్యాయమైన పోరాటం కాబట్టే పలు సామాజిక సంఘాలు బాధితులకు సంఘీభావం తెలిపాయన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనీ, లేకపోతే మీ సమస్యను అవసరం అయితే గవర్నర్, రాష్ట్రపతి వరకు తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే వరకు ఏ స్థాయిలో అయినా పోరాడుతామని తెలిపారు.

Next Story