- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకం కొనసాగాలి : CPM
దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని డిసెంబరు 27న శనివారము గోపాల్ పేట రచ్చకట్ట

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని డిసెంబరు 27న శనివారము గోపాల్ పేట రచ్చకట్ట నుంచి ర్యాలీ చేసి అనంతరం తాసి ల్దార్ కార్యాలయం ముందు సీపీఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విబి జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని ధర్నా చేశారు. ఈ ధర్నా సందర్భంగా సీపీఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు పాల్గొని ప్రసంగిస్తూ" మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్తుభారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజివికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని వి బి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని వివరించారు.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టము 2005 లో సిపిఎం వామపక్షాల ఒత్తిడితో పని హక్కుగా చట్టం చేయబడిందన్నారు.నేడు డిసెంబర్ 18, 2025న మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, వీబిజీ రాంజీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా పార్లమెంటులో ఆమోదం చేసుకోవడం అన్యాయం అన్నారు.పేదల కడుపు కుట్టి విబి జి రాంజీ పథకం తెచ్చారన్నారు.
విబి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని, గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ఈజీఏ కొనసాగించాలని అన్నారు. ఎం జి ఎన్ఆర్ఈజీఏ 2005 చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి 90% నిధులు ఇచ్చేదని రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఖర్చు చేయాలని ఆ చట్టంలో ఉంది అన్నారు. కానీ నేడు విబిజి రాంజీ పథకం లో కేంద్రం 60 శాతం నిధులు, రాష్ట్రము 40 శాతం నిధులు ఇవ్వాలని పథకంలో మార్పులు చేశారు.మొదట రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు ఖర్చు చేశాక కేంద్రం నిధులు ఉపాధికి ఇస్తామని ఈ పథకంలో పేర్కొనడం ఉపాధి హామీని పూర్తిగా రద్దు చేయడం తప్ప ఇంకోటి కాదని అన్నారు. కేంద్ర బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం పేద కూలీల కడుపు కొట్టి ఆకలి చావులతో సచ్చే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ధనవంతులకు సంపదదోచిపెడుతుందన్నారు. ఈ బిల్లు పై కేరళ,కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జి రాంజీ బిల్లు రద్దు చేయాలని పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వి బి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్నారు. గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనికి సంబంధం లేని విధంగా పథకాన్ని మార్చారని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామాల్లో మాత్రమే ఉపాధి పని ఉంటుందని గ్రామపంచాయతీలకు ఎలాంటి అధికారం లేకుండా చేసిందని కావున గ్రామపంచాయతీలు వి బిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పాత పథకాన్ని కొనసాగించాలని తీర్మానాలు చేయాలని అన్నారు.
చట్టం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని ఎంజిఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని బలహీనపరచడం ద్వారా సంగు పరివార్ గాంధీ వారసత్వం పట్ల శ్రమ ద్వారా గౌరవం అనే ఆలోచన పట్ల తన శత్రుత్వాన్ని చూస్తుందని అన్నారు.60 రోజుల పనిని ఈ నిబంధనల ప్రకారం నిషేధించింది అని తెలిపారు. ఇది పేదల పాలిట శత్రువుగా అభివర్ణించారు. సంపన్నులకు దేశ సంపద దోచిపెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల నోటికాడి కూడు గుంజుకున్నదనివిమర్శించారు. ఇప్పటికైనా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ ఈజీఏ కొనసాగించాలని, వి బి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా తహసిల్దార్ తిలక్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపాల్ పేట గ్రామ ఉపాధి కూలి సంఘం నాయకులు బాలమషయ్య, శ్రీరాములు,రాజన్న,ఆంజనేయులు, చెన్నమ్మ, నిరంజనమ్మ, కమలమ్మ, శాంతమ్మ,లక్ష్మి, సాయిలు, చిన్నగట్టన్న, కురుమయ్య, గొల్ల తిరుపతయ్య పాల్గొన్నారు.






