- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల పొలాల్లో మట్టి, రాళ్లు డంపింగ్
మక్తల్-నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కాల్వల త్రవ్వకాల్లో చేపట్టిన పనుల్లో తీసిన రాళ్లు, మొరాన్ని కాంట్రాక్టర్లు పంట పొలాల్లో దౌర్జన్యంగా డంప్ చేస్తున్నారని భూ నిర్వాసితుల సంఘం బృందం జిల్లా నాయకులు జి. వెంకటరామిరెడ్డి ఆరోపిస్తున్నారు.

దిశ, మక్తల్ : మక్తల్-నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కాల్వల త్రవ్వకాల్లో చేపట్టిన పనుల్లో తీసిన రాళ్లు, మొరాన్ని కాంట్రాక్టర్లు పంట పొలాల్లో దౌర్జన్యంగా డంప్ చేస్తున్నారని భూ నిర్వాసితుల సంఘం బృందం జిల్లా నాయకులు జి. వెంకటరామిరెడ్డి ఆరోపిస్తున్నారు. మక్తల్ మండల పరిధిలోని కాచువార్ లోని రైతుల నిర్వాసితుల సంఘం దృష్టికి తీసుకురాగా.. కాంట్రాక్టర్లు చేస్తున్న పనులను పాడైన పంట పొలాలను భూనిర్వాసితుల సంఘం బృందం గురువారం పరిశీలించారు. భూ నిర్వాసితుల సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, గోవింద్ రాజ్ విలేకర్లతో మాట్లాడారు.
మక్తల్- నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో చేపట్టిన పనుల్లో తీసిన రాళ్ళు మొరాని కాంట్రాక్టర్లు భూసేకరణలో తీసుకున్నా 20 మీటర్ల పరిధిలో కాలువ పనులు చేయాల్సి ఉండగా.. అదనంగా 15 మీటర్ల వరకు ఆక్రమించుకున్నారని తెలిపారు. దీంతో దిగువకు వర్షపు నీరు వెళ్లకుండా నిలిచిపోయింది. పొలం సాగు చేసుకునేందుకు వీలు లేకుండాపోయిందని రైతులు పేర్కొంటున్నారు. తనకు ఉన్న మూడెకరాల పంట పొలంలో నీళ్లు నిలిచాయని.. వెంకటయ్య గౌడ్, ప్రమీల, శివరాములు అనే రైతులు సంఘానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాలువలో తీసిన రాళ్లను, మట్టిని రైతుల పొలాల్లో వేసిన విషయం పై ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు.తక్షణమే కాంట్రాక్టర్ పై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు వ్యవహరిస్తే.. రైతులు మూకుమ్మడిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్ కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గోవింద రాజు, చింతల అంజప్ప రైతులు పాల్గొన్నారు.






