- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయించాలి
మొయినాబాద్ ఘటనను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని తాను సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు తెలిపారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

దిశ, జడ్చర్ల : మొయినాబాద్ ఘటనను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని తాను సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు తెలిపారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తొలుత కాంగ్రెస్ నుంచి తనకే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని.. పరీక్షలు చేయించుకోవడానికి అందరి కంటే ముందుంటానని తెలిపారు. డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వారిని మళ్లీ డ్రగ్స్ ముట్టుకోవాలంటే భయపడేటట్టు కఠినంగా శిక్షించాలని కోరారు. మొయినాబాద్ ఘటనలో డ్రగ్స్ సేవించి అధికారులకు పట్టుబడిన వారు ఇతరున గన్ తీసుకొచ్చి వాడారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తన వద్ద కూడా గన్ ఉందని.. కానీ తాను ఎప్పుడూ బయటికి తీయలేదని, గన్ ఉన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు అన్నారు. గన్ వాడిన వారు ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే భయపడే విధంగా కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.






