- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైనేజ్ మూత లేక ప్రమాదాలు..పట్టించుకోండి సార్..!
దిశ , బిజినేపల్లి : మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో గల ప్రధాన రహదారిలో అండర్ డ్రైనేజీ ఉంది. ఈ డ్రైనేజీ రోడ్డు మధ్యలో ఉన్న మాన్యువల్ కు మూత పెట్టకుండా

దిశ , బిజినేపల్లి : మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో గల ప్రధాన రహదారిలో అండర్ డ్రైనేజీ ఉంది. ఈ డ్రైనేజీ రోడ్డు మధ్యలో ఉన్న మాన్యువల్ కు మూత పెట్టకుండా ప్రమాదకరంగా ఉంది. దీనికి తోడు రాత్రి సమయంలో వీధిలైటు వెలగకపోవడంతో అండర్ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కనిపించకపోవడంతో కాలినడకన వెళ్లే ప్రజలు ఎన్నోసార్లు అందులో పడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కారుకొండ, కుమ్మెర వంటి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డు మధ్యలో ఉండడంతో ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో ఎన్నోసార్లు గ్రామ అధికారికి విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గ్రామానికి నడిబొడ్డులో ఇట్టి మ్యానువల్ ఉంటేనే పట్టించుకోకపోవడంతో గ్రామములో ఉండే సమస్యలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని గ్రామ ప్రజలు అంటున్నారు. ఈ మ్యాన్ హోల్ తో ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అని ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మ్యానువల్ పై మూత బిగించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.






