- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తి జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం పై అనుమానాలు
దిశ, మక్తల్ : నియోజకవర్గంలోని వడ్డెవాట్ చౌరస్తాలోని పత్తి మిల్లులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం జరిగిందని మిల్లు యజమాని పేర్కొన్నాడు.

దిశ, మక్తల్ : నియోజకవర్గంలోని వడ్డెవాట్ చౌరస్తాలోని పత్తి మిల్లులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం జరిగిందని మిల్లు యజమాని పేర్కొన్నాడు. మిల్లులో పత్తి బ్లేడ్లను మార్చుతుండగా యంత్రాలు వేడేక్కి నిప్పురవ్వల వల్లా అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి పక్కకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. గత ఏడాది ఇదే జిన్నింగ్ మిల్లులో నిల్వ ఉంచిన పత్తి కరెంట్ షాక్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరపకుండా స్థానిక నాయకుడు సహకరించాడని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అరకోర ఎంక్వయిరీ నివేదికతో కోట్లాది రూపాయి ఇన్సూరెన్స్ పొందాడనే ఆరోపణలున్నాయి.
పాతిక సంవత్సరాల కిందట బ్యాంకు లోన్లతో మిల్లుల వ్యాపారాన్ని ప్రారంభించి కిస్తీలు చెల్లించలేక డిఫాల్ట్ గా మారి సెటిల్మెంట్ కింద లోన్ చెల్లించాడని ఆరోపణ లున్నాయి. గత ప్రభుత్వం సేకరించి ధాన్యం ఈ రైస్ మిల్లులో ఉంచిన సకాలంలో మరాడించి ప్రజా పంపిణీకీ బియ్యం ఇవ్వడంలో డిపాల్టు కావడంతో ఆలస్యంపై మిల్లులపై తనిఖీలు చేయగా కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులో లేకపోవడంతో మిల్లు పై కేసు నమోదు చేశారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకుని వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అయితే ఈసంవత్సరం పత్తి మిల్లులో అగ్నిప్రమాదం జరగడంపై మార్కెట్ లో పలువురు వ్యాపారస్తులు అగ్ని ప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది అగ్ని ప్రమాదం జరగడం ఫై ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్టపరిహారం పొందేందుకు ప్రయత్నమా అని ఆరోప ణలున్నాయి. జిన్నింగ్ మిల్లుల్ లో తరుచుగా జరుగుతున్న అగ్నిప్రమాదాలపై లోతైన దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాపారస్తులు, ప్రజలు పేర్కొనడం గమనార్హం.






