- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి పక్షంలో బీసీ, అధ్యక్ష పదవీలో దళిత నాయకుడిని కూర్చోబెట్టే దమ్ము బీఆర్ఎస్ కి ఉందా..? : ఎమ్మెల్యే మేఘా రెడ్డి
దిశ, వనపర్తి : ప్రతిపక్ష నాయకుడి స్థానంలో బీసీ నాయకుడిని, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిలో దళిత నాయకుడిని కూర్చోబెట్టే దమ్ముందా అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్

దిశ, వనపర్తి : ప్రతిపక్ష నాయకుడి స్థానంలో బీసీ నాయకుడిని, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిలో దళిత నాయకుడిని కూర్చోబెట్టే దమ్ముందా అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దాదాపు 10,688 మందికి సీఎం సహాయ నిధి, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఎల్ఓసీ లబ్దిదారులకు మొత్తం రూ.64,32,04.598 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి కట్టుబడి పాలనలో, అభివృద్ధి లో మహిళలను భాగస్వాములను చేశామన్నారు. వనపర్తి నియోజకవర్గంలో సీఎం, మంత్రులు శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, కాలవలు, తదితర అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలయ్యాయని తెలిపారు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పై శ్వేత పత్రం విడుదల చేయాలన్న తన డిమాండ్ కు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.నియోజకవర్గం లో 23 నెలల కాంగ్రెస్ పాలనలో తాను ఎక్కడ అవినీతికి పాల్పడలేదని, ఎక్కడ తప్పు జరిగిన నా దృష్టి తీసుకొస్తే.. సరిదిద్దుకుంటామన్నారు. ప్రజల డబ్బులు..ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన సుమారు రూ.8 వేల కోట్ల అప్పు కు మిత్తి కట్టుకుంటూ, తాము ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలుచేస్తామన్నారు. భవిష్యత్ లో ప్రజల ఆశీస్సులుతో రానున్న 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలలో అభివృద్ధికి ఓటు వేసి, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగేలా ప్రోత్సాహించాలన్నారు. ప్రజల దీవెనలనే ప్రజా ప్రభుత్వం-కాంగ్రెస్ పార్టీని అండదండలన్నారు.






