గ్రామ‌పంచాయ‌తీ అనుమ‌తి లేనిది నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్దు

by Ratna Kumari |

గ్రామ పంచాయ‌తీ అనుమ‌తి లేనిది గ్రామంలో నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని స‌ర్పంచ్ బెట్ట‌రీ రేణుక నాగ‌రాజు పేర్కొన్నారు.

గ్రామ‌పంచాయ‌తీ అనుమ‌తి లేనిది నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్దు
X

దిశ, పెద్ద కొత్త పల్లి : గ్రామ పంచాయ‌తీ అనుమ‌తి లేనిది గ్రామంలో నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని స‌ర్పంచ్ బెట్ట‌రీ రేణుక నాగ‌రాజు పేర్కొన్నారు. పెద్ద‌ప‌ల్లి గ్రామపంచాయ‌తీ ప‌రిధిలో నూత‌నంగా నిర్మాణం చేప‌ట్ట‌బోయే ఇళ్ల‌కు గ్రామ‌పంచాయ‌తీ అనుమ‌తులు త‌ప్ప‌ని స‌రి అని.. ఆదివారం మ‌హాత్మ‌గాంధీ భ‌వ‌న నిర్మాణ తాపీ కార్మిక సంఘం ప్ర‌తినిధుల‌కు నోటీసులు అంద‌జేశారు. గ్రామంలో నిర్మించ‌బోయే భ‌వ‌నానికి గ్రామ‌పంచాయ‌తీ అనుమ‌తి ఉన్న‌దా..? లేదా అనే క్షుణ్ణంగా ప‌రిశీలించిన త‌రువాతనే నిర్మాణం చేప‌ట్టాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామ‌పంచాయ‌తీ అనుమ‌తి ప‌త్రం లేకుండా ఇళ్ల నిర్మాణం చేప‌ట్టే య‌జ‌మానికి జ‌రిమానా విధించ‌బ‌డుతుంద‌ని స‌ర్పంచ్ రేణుక హెచ్చ‌రించారు. ఈ విష‌యాన్ని పెద్ద కొత్త‌ప‌ల్లి గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో ఉన్న మేస్త్రీల సంఘం ప్ర‌తినిధులుఅంద‌రూ గ‌మ‌నించి గ్రామ‌పంచాయ‌తీకి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Next Story