రాధికను సన్మానించిన జిల్లా ఎస్పీ జానకి

by Ratna Kumari |

దిశ‌, అడ్డాకుల : డెబ్బై నాల్గొవ‌ ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్ లో కాంస్య పతకం సాధించిన మహిళ కానిస్టేబుల్ రాధిక ను ఎస్పీ డి జానకి బుధవారం సన్మానించారు. హర్యానా రాష్ట్రంలో

రాధికను సన్మానించిన జిల్లా ఎస్పీ జానకి
X

దిశ‌, అడ్డాకుల : డెబ్బై నాల్గొవ‌ ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్ లో కాంస్య పతకం సాధించిన మహిళ కానిస్టేబుల్ రాధిక ను ఎస్పీ డి జానకి బుధవారం సన్మానించారు. హర్యానా రాష్ట్రంలో సెప్టెంబర్ 20 నుండి 24 వరకు జరిగిన పోటీలలో తెలంగాణ పోలీస్ బృందం తరఫున అడ్డాకుల పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ రాధిక పాల్గొన్నారు. (డబ్ల్యూపీసి 2405) 80+ కేటగిరీలో ఎస్ ఎస్ బి ప్లేయర్ సంగీత పై అద్భుతమైన పోరాట ప్రతిభను కనబరిచి కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా తన చాంబర్‌లో రాధిక కు జిల్లా ఎస్పీ శాలువా కప్పి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ రాధిక చూపిన కృషి, పట్టుదల మరియు క్రీడాస్ఫూర్తి ఇతర పోలీస్ సిబ్బందికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది క్రీడా రంగంలోనూ ప్రతిభ చాటడం ఎంతో గర్వకారణమన్నారు.


Next Story