ఇంటింటి ఓట‌ర్ స్లిప్ లు పంపిణీ షురూ..!

by Ratna Kumari |

మక్తల్ మున్సిపాలిటీలోని ఓటర్ స్లిప్పుల డిస్ట్రిబ్యూషన్ ని బిఎల్ఓ లతో కలిసి శనివారం మధ్యాహ్నం తాసిల్దార్ సతీష్ కుమార్. కమిషనర్ శ్రీరామ్ ప్రారంభించారు.

ఇంటింటి ఓట‌ర్ స్లిప్ లు పంపిణీ షురూ..!
X

దిశ‌, మ‌క్త‌ల్ : మక్తల్ మున్సిపాలిటీలోని ఓటర్ స్లిప్పుల డిస్ట్రిబ్యూషన్ ని బిఎల్ఓ లతో కలిసి శనివారం మధ్యాహ్నం తాసిల్దార్ సతీష్ కుమార్. కమిషనర్ శ్రీరామ్ ప్రారంభించారు. మున్సిపాలిటీ ప‌రిధిలో 23,450 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని.. వారంద‌రికీ నేరుగా స్లిప్ ల‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. ఓట‌ర్ స్లిప్ ల‌ను అంద‌ని వారు నేరుగా మున్సిప‌ల్ ఆఫీస్ ను సంప్ర‌దించాల‌ని సూచించారు. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు పార్టీల వారు స్లిప్ ల‌ను మంచి త‌న‌కే ఓటు వేయాల‌నే ప్ర‌చారం కొన‌సాగుతుంద‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వ‌మే నేరుగా బీఎల్వోల‌తో చేస్తున్నామ‌న్నారు. మున్సిపాలిటీలో ఉన్న చందాపురం, దండు, తిర్లాపురం, గార్ల‌ప‌ల్లి విలీన గ్రామాల‌తో పాటు 16 వార్డుల్లో నివ‌సిస్తున్న ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌నే ఉద్దేశంతో నేరుగా నివాసంలో కుటుంబ య‌జ‌మాని ఆ కుటుంబానికి సంబంధించిన వారంద‌రికీ ఓట‌ర్ స్లిప్ ల‌ను నేరుగా అద‌జేస్తార‌ని తెలిపారు.

Next Story