'దిశ ఎఫెక్ట్.. వివాదాస్పద అధికారిపై వేటు

by Ratna Kumari |   (  Updated:2026-02-14 16:58:54  IST  )

మహబూబ్ నగర్ జిల్లాలో 'దిశ' పత్రిక ప్రచురించిన వరుస సంచలనాత్మక కథనాలకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.

దిశ  ఎఫెక్ట్.. వివాదాస్పద అధికారిపై వేటు
X

దిశ-మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో 'దిశ' పత్రిక ప్రచురించిన వరుస సంచలనాత్మక కథనాలకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజెక్ట్ అధికారి వ్యవహారశైలిపై 'దిశ'లో వచ్చిన వార్తలపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఎన్నికల వేళ ఎటువంటి చప్పుడు లేకుండా సదరు ఆధికారి ఆకుల శ్రీకాంత్ ని సైలెంట్ గా తప్పించేశారు.ఆయన స్థానంలో మదన్ మోహన్ గౌడ్ చార్జ్ తీసుకుని వారం రోజుల గడుస్తున్న ఆ విషయాన్ని బయటికి పోక్కనీయలేదు.

అక్రమాలపై గళం విప్పిన 'దిశ

"మహబూబ్ నగర్‌లో డ్యూటీ.. హైదరాబాద్‌లో పార్టీ" అనే శీర్షికతో సదరు అధికారి విధులకు గైర్హాజరవుతూ, ఇసుక మాఫియాతో కలిసి విందు వినోదాల్లో మునిగితేలుతున్నారని దిశ ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురించింది. ఆరు నెలలుగా జిల్లాలో ప్రభుత్వ ఇసుక క్వారీలను ప్రారంభించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ, ఖజానాకు గండి కొడుతున్న తీరును ఎండగట్టింది. ఇసుక కాంట్రాక్టర్లతో కలిసి ఆయన చేస్తున్న అక్రమ దందాలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

మదన్ మోహన్ గౌడ్‌కు బాధ్యతలు

ఈ కథనాలపై రాష్ట్రస్థాయి అధికారులు విచారణ జరిపి, ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు అధికారిని సైలెంట్‌గా పక్కన పెట్టారు. ఆయన స్థానంలో మదన్ మోహన్ గౌడ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

ప్రజల్లో పెరిగిన విశ్వాసం

'దిశ' పత్రికలో వచ్చే వార్తల్లో ఉండే ఖచ్చితత్వం, ప్రజా సమస్యలపై చూపే నిబద్ధతకు ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచింది. వరుస కథనాల నేపథ్యంలో రాష్ర్ట ఉన్నతాధికారులు తీసుకున్న ఈ చర్యపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల అక్రమాలను ప్రశ్నించడంలో 'దిశ' ఎప్పుడూ ముందుంటుందని ఈ 'దిశ ఎఫెక్ట్' మరోసారి నిరూపించింది.

Next Story