- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధన్వాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం జరిగేనా..?
ధన్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి స్థలం ఎంపికలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

దిశ, ధన్వాడ : ధన్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి స్థలం ఎంపికలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ధన్వాడకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేశారు. దివంగత నేత మాజీ పీసీసీ సభ్యులు డి. రామచంద్ర రావుతో పాటు విద్యార్థుల యువత కోరిక మేరకు రాజేందర్ రెడ్డి డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. అప్పటి ఎమ్మెల్యే డిగ్రీ కళాశాల మంజూరు చేయిస్తే ప్రస్తుతం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేయించి నిర్మాణ పనులను ప్రారంభించడానికి కృషి చేస్తున్నారు.
డిగ్రీ కళాశాల భవనం నిర్మాణం కోసం స్థలం ఎంపికలో సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ధరంభాయ్ మఠం వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో డిగ్రీ కళాశాల భవనం నిర్మించాలని అధికార పార్టీ నాయకులు యోచిస్తున్నారు. కొంతమంది దరంబాయ్ మఠం వద్ద కాకుండా క్రీడా మైదానం పక్కన ఉన్న దొడ్ల స్థలంలో కళాశాలను నిర్మించాలని కొంతమంది పట్టు పడుతున్నారు. ఈ స్థలంలో అప్పట్లో కొంతమంది ప్రహరీ లను నిర్మించుకున్నారు ఈ స్థలం గ్రామకంఠం లో ఉందంటూ ఈ స్థలంలోనే కళాశాల భవనం నిర్మించాలని పట్టుబడుతున్నారు. దీనికి తోడు ధరంభాయ్ మఠం వద్ద డిగ్రీ కళాశాల నిర్మిస్తే ఊరి చివరన అవుతుందని దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని పలువురు వాపోతున్నారు. అందరికీ అనువైన స్థలంలోనే నిర్మించాలంటూ కోరుతున్నారు.
డిగ్రీ కళాశాల భవన నిర్మాణ స్థలం ఎంపిక చేయడం కోసం డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు మాధవరెడ్డి ఉపసర్పంచ్ నరసింహులు తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కొన్ని స్థలాల ను పరిశీలించారు. ప్రధానంగా ధరంభాయ్ మఠం వద్ద నిర్మిస్తేనే బాగుంటుందంటూ కొంతమంది సూచించినట్లు సమాచారం. దీంతో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం నిధులు ఉన్నప్పటికీ స్థలం ఎంపికలో సందిగ్ధత నెలకొంది నిధులు మంజరై నెలలు గడుస్తున్న నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు కొంతమంది ఒక దిక్కు.. మరి కొంతమంది ఇంకో దిక్కు స్థలాలను చూపించడంతో అయోమయం నెలకొంది స్థలం ఎంపిక విషయమై కొంత సానుకూలత.. కొంత వ్యతిరేకత కనిపిస్తుండడంతో ఎప్పుడు ఈ సమస్య తీరుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.






