- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు పంటపై రాక్షసత్వం
దిశ, ఉప్పునుంతల: రైతు పంటపై రాక్షసత్వం ప్రదర్శించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆరుగాలం కష్టపడి పంట

దిశ, ఉప్పునుంతల: రైతు పంటపై రాక్షసత్వం ప్రదర్శించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆరుగాలం కష్టపడి పంట పండించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ రైతు కష్టానికి గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలు పత్తి పంటకు నిప్పంటించారు. దీంతో 10 క్వింటాళ్ల పత్తి కాలడంతో సుమారు లక్షన్నర మేర నష్టం మిగిల్చిన సంఘటన ఉప్పునుంతల మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పునుంతల గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రైతు మేడమోని తిరుపతయ్య ఇంటి ముందు ఖాళీ స్థలంలో బయటి భాగంలో 30 క్వింటాళ్ల పత్తి నిల్వ చేసుకున్నాడు. సాయంత్రం సమయంలో ఎవ్వరు లేని సమయాన్ని గమనించి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంచించి పోవడంతో చుట్టు పక్కల వారు గమనించి పత్తిని కాలుతున్న పత్తి పై నీళ్లు చల్లి ఆర్పేసి రైతుకు సమాచారం ఇచ్చారు. రైతు ఇంటికి వచ్చి చూసి కన్నీటి పర్యంతంఅయ్యాడు. ఇరుగు పొరుగు వారు చల్లార్పినప్పటికీ సుమారు 10 క్వింటాళ్ల మేర పత్తి కాలి బూడిదైనదని రైతు కన్నీటి పర్యంతం అయ్యాడు.నేనేం పాపం చేశాననీ ఏదైనా కక్షసాధింపు ఉంటే నాతో పోట్లాడాలి. కానీ ఇలా పంటపై కక్షసాధింపు దుర్మార్గమైన పని అని ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రైతు కోరారు.






