రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

by Elthuri vijay kumar |

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మొల్గర గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళా ప్రయాణికురాలు చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.

రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
X

రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

మహబూబ్ నగర్- నాగర్ కర్నూల్ రోడ్డుపై ప్రమాదం

మొలుగర గ్రామం సమీపంలో ఆటోను ఢీకొన్న లారీ

స్పాట్ లో ఇద్దరు.. చికిత్స పొందుతూ ఒకరు మృతి

దిశ, భూత్పూర్ : మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మొల్గర గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళా ప్రయాణికురాలు చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఖిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ బుధగాని నరసింహులు తన ఆటోలో ప్రయాణికులను తీసుకొని మహబూబ్ నగర్ బయలుదేరాడు. మొలుగర గ్రామ శివారు తుల్జా భవాని తాండ వద్ద మహబూబ్ నగర్ -నాగర్ కర్నూల్ రోడ్డుపై వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో.. ఆటో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఖిల్లా గణపురం మండలం గట్టుకాడుపల్లి గ్రామానికి చెందిన గుంపల్లి వంశీ (24), హైదరాబాదులో నివాసం ఉంటున్న చౌదరి నరసింహారెడ్డి (56) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ దొంతిగుంట తండాకు చెందిన పద్మావత్ సక్రి మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భూత్పూర్ మండల పరిధిలోని పోతులమడుగు గ్రామానికి చెందిన చౌదరి నరసింహారెడ్డి గత కొన్నేళ్లుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నాడు. ఖిలా గణపురం మండలంలో బంధువు మరణించడంతో ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరాడు. దసరా సెలవులు వస్తుండడంతో దివిటీ పల్లి గురుకుల పాఠశాలలో ఉన్న తన కూతుళ్లను ఇంటికి తీసుకురావడానికి వంశీ మహబూబ్ నగర్ లో వ్యక్తిగత పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story