- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీఎం, బైక్ ఢీ.. ఒకరి మృతి!
by Taduka Kalyani |
గుర్తు తెలియని డీసీఎం బైకును ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో శనివారం రాత్రి జరిగింది.

X
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: గుర్తు తెలియని డీసీఎం బైకును ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లేష్ తన ద్విచక్ర వాహనంపై నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి బయలుదేరాడు.
ఈ క్రమంలో నాగర్ కర్నూల్ నుంచి తెలకపల్లి వైపు వెళ్తున్న గుర్తుతెలియని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా ఢీకొట్టిన డీసీఎం ఆపకుండా పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






