- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులను మోసం చేస్తున్న దళారు వ్యవస్థ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో దళారు వ్యవస్థ రైతులను మోసం చూస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోకల మనోహర్ విమర్శించారు.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో దళారు వ్యవస్థ రైతులను మోసం చూస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోకల మనోహర్ విమర్శించారు. గురువారం కురిసిన అకాల వర్షానికి అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మార్కెట్ లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ అచ్చంపేట మండల తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చాక రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఈ మార్కెట్ కి 20 రోజుల క్రితం వచ్చిన ధాన్యాన్ని కూడా కొనకపోవడం దుర్మార్గమని, ధాన్యాన్ని కొనలేక రైతులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గానీ, అధికారులు కానీ స్పందించి మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అమినోదిన్, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసిరాం, మండల పార్టీ అధ్యక్షులు పర్వతాలు, కౌన్సిలర్ రమేష్ రావు, నాయకులు బెల్లి బాలరాజు, పర్వతాలు, సుల్తాన్, రాజేష్, సోషల్ మీడియా ఇన్ చార్జి పిల్లి బాలరాజు పాల్గొన్నారు.






