అనుమతులు లేకుండానే చెట్ల నరికి వేత

by Ratna Kumari |

వర్షం కురవడానికి ప్రధానాధారమైన అటవి సంపద కలప వ్యాపారుల దాహానికి రోజు రోజుకు కనుమరుగు అవుతోంది.

అనుమతులు లేకుండానే చెట్ల నరికి వేత
X

దిశ, మద్దూరు : వర్షం కురవడానికి ప్రధానాధారమైన అటవి సంపద కలప వ్యాపారుల దాహానికి రోజురోజుకు కనుమరుగు అవుతోంది. ఎక్కడ పచ్చని చెట్లు కనిపించినా అక్కడ గబ్బిలంలా వాలి పోయి సంబంధిత రైతులకు ఎంతో కొంత ముట్ట జెప్పి పెద్ద పెద్ద చెట్లను సైతం నరికి కట్టెల మిషన్లకు తరలించి అక్కడి నుండి రాయచూర్ కు డీసీఎంలలో అనుమతి ఒకే అనుమతి పత్రంతో 5 నుంచి 6 లోడ్లు పంపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కట్టెల మిషన్లు జనవాసాల మధ్యలో ఉండటంతో విపరీతమైన శబ్దంతో పాటు పొట్టు కూడా సమీపంలోని ఇంట్లోకి రావడంతో పెద్దవారితో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని ఇదే విషయమై గతంలో జిల్లా ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు అంటున్నారు.

పర్యావరణ సమతుల్యత, జీవవైవిద్యం దెబ్బతింటుంది. వాల్టా చట్టం ప్రకారం.. అడవులతో పాటు రైతు పంట పొలాల్లో కూడా చట్టవిరుద్ధంగా చెట్లను నరకకూడదు. కేవలం అటవీశాఖ అనుమతితో అడవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎండిపోయిన, బలహీనమైన, తెగుళ్లు సోకిన లేదా అగ్నిప్రమాదాలకు కారణమయ్యే చిన్న చెట్లను మాత్రమే నరకాలి. పర్యావరణ సమతుల్యత కోసం పెద్ద చెట్లను, ఆరోగ్యకరమైన చెట్లను సజీవంగా ఉన్న,అరుదైన మరియు పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను నరకడం పూర్తిగా నిషేధం. ఇదే విషయం గత సంవత్సరం దిశ పత్రికలో కథనం వచ్చిన కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కలప వ్యాపారులు మాత్రం ఎప్పటిలాగే అనుమతులు లేకుండానే విలువైన నెమలి, వేప,మామిడి వంటి విలువైన చెట్లను కూడా చెట్లను నరికి వేస్తుండటంతో జీవవైవిద్యం దెబ్బ తినడంతో పాటు వన్యప్రాణులు తమ ఆవాసాలు కోల్పోవడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి.


గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మద్దూరు పట్టణ కేంద్రంలో కోతులు పదిమందికి పైగా దాడి చేయడంతో ఆసుపత్రుల పాలయ్యారు. అలాగే కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ శివారు తిరుమల గట్టు దగ్గర, మద్దూరు మున్సిపల్ పరిధిలోని రేనివట్ల పెద్ద చెరువు చుట్టుపక్కల గల గుట్టల ప్రాంతంలో చిరుత పులులు సంచరించటం గమనించవచ్చు. ఇంత జరుగుతున్న కూడా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం వనంహోత్సవంలో భాగంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొక్కలను నాటడంతోపాటు, ప్రచారం చేస్తున్న కూడా కలప వ్యాపారులు పెద్ద మొత్తంలో అడవులను నరికి వేయడంతో ఏట్లో పోసిన పన్నీరులా అవుతుందని ప్రజలు అంటున్నారు.

Next Story