ఊరికో ఉద్యోగం ఇవ్వలేని వాళ్ల విమర్శించేది

by Naveena |

ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా,ఊరికి ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోనీ వాళ్ల తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని డిసిసి అధ్యక్షుడు,దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

ఊరికో ఉద్యోగం ఇవ్వలేని వాళ్ల విమర్శించేది
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా,ఊరికి ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోనీ వాళ్ల తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని డిసిసి అధ్యక్షుడు,దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ రైతులను ఆదుకునే దిశగా 18 వేల కోట్ల రూపాయలను కేటాయించడం హర్షణీయమని,అంతేకాకుండా బడుగుబలహీన వర్గాలను ఆదుకునే దిశగా కూడా ఈ బడ్జెట్ ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

గ్రామీణ అభివృద్ధికి 31 వేల కోట్లు,విద్యుత్ సౌకర్యాలకు 21 వేల కోట్లు,రాజీవ్ యువ వికాసం కు 7 వేల కోట్లు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి ఇరిగేషన్ కు 28 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం అభినందనీయమని అన్నారు. జిల్లాలోని రైతన్నల ప్రతి ఇంటికి రైతు భరోసా చేరుతుందని,ఇది అంకెల గారడీ కాకుండా,అందరికీ ఆమోదయోగ్యమైన జనరంజకమైన బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పార్టీ,ప్రజల తరపున,ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకుండా,రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ప్రతిపక్ష నాయకులు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా జిఎంఆర్ చెప్పారు. ఈ సమావేశంలో ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ కుమార్ గౌడ్,మిథున్ రెడ్డి,కురుమూర్తి దేవస్థానం కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ నేతలు జహీర్ అత్తర్,సీజే బెనర్,రాములు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

Next Story