భూతగాదాలో దాయాదుల దాడి.. తీవ్ర గాయాలు

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, కారుకొండ గ్రామంలో దయాదుల దాడిలో మమ్మద్ ఫయాజ్ (45) అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

భూతగాదాలో దాయాదుల దాడి.. తీవ్ర గాయాలు
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, కారుకొండ గ్రామంలో దయాదుల దాడిలో మమ్మద్ ఫయాజ్ (45) అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించి బాధితుడి భార్య రహీమునిసా బేగం బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..కారుకొండ గ్రామంలో మహమ్మద్ ఫయాజ్ కుటుంబానికి వారి దాయాదులైనా పెద్దనాన్న కుమారులు మహమ్మద్ ఖలీలుల్లా, మహమ్మద్ కలీముల్లా కుటుంబానికి వ్యవసాయ భూమి ఉంది. భూ పంపకాలలో భాగంగా ఇటీవల హద్దులు ఏర్పాటు చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నారు. డాక్యుమెంటేషన్ పూర్తికాకుండానే గురువారం సాయంత్రం వ్యవసాయ భూమిని ట్రాక్టర్ తో దున్నుతుండగా ఇరువురి మధ్య మాట పెరగడంతో అందరి సమక్షంలోనే ఖలీలుల్లా అతని తమ్ముడు కలీముల్ల మరికొందరు గొడ్డలితో మహమ్మద్ ఫయాజ్ మొఖం తలపై తీవ్రంగా దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో పలువురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి రేఫర్ చేశారు. బాధితుడి భార్య రహిమునిస బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిజినేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిజినపల్లి ఎస్సై శ్రీనివాసులు బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు.

Next Story