- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోగులాంబ అర్చకుల సస్పెన్షన్ ను కొట్టివేసిన కోర్టు
by Elthuri vijay kumar |
ఆదివారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు తెలిపిన అర్చకులు

X
జోగులాంబ అర్చకుల సస్పెన్షన్ ను కొట్టివేసిన కోర్టు
ఆదివారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు తెలిపిన అర్చకులు
దిశ, అలంపూర్ టౌన్: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అర్చకులపై వేసిన సస్పెన్షన్ ను తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ నాయకుడి పెళ్లిలో వేద ఆశీర్వచనం చేశారని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న ముగ్గురు అర్చకులపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఈవో అనుమతితోనే మేము పెళ్లికి వెళ్ళామని సదరు అర్చకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆ సస్పెన్షన్ చెల్లదని తాజాగా తీర్పు ఇచ్చింది. సదరు అర్చకులు ఆదివారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
Next Story






