బాలికలకు ధైర్యమే అసలైన ఆభరణం

by Ratna Kumari |

బాలికలకు ఆత్మవిశ్వాసం, ధైర్యమే సరైన ఆభరణమని సమాజంలో రక్షణ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలిక విద్యాధికారి శోభారాణి అన్నారు.

బాలికలకు ధైర్యమే అసలైన ఆభరణం
X

దిశ, ఉప్పునుంతల : బాలికలకు ఆత్మవిశ్వాసం, ధైర్యమే సరైన ఆభరణమని సమాజంలో రక్షణ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలిక విద్యాధికారి శోభారాణి అన్నారు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికా సాధికారత కిషోర్ బాలల రక్షణ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటు సమాజంలో తమ రక్షణ పట్ల ఆత్మవిశ్వాసం ధైర్యం అసలైన ఆభరణమని ఆమె పేర్కొన్నారు. బాలల హక్కులు భద్రత కిషోర్ ప్రాయంలో వచ్చే శారీరక మానసిక మార్పుల పట్ల ఆమె అవగాహన కల్పించారు. అనంతరం క్లబ్ టీచర్ బీ స్కేల్ మాట్లాడుతూ పాఠశాలలో బాలికల సమస్యల పరిష్కారానికి వారి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థుల భద్రత కోసం తమ పాఠశాల ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుంది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యం నింపుతాయని ఆయన కొనియాడారు.

రోల్ మోడల్ కెరీర్ గైడెన్స్ పై అవగాహన..

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రోల్ మోడల్ కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రమ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు వైద్యురాలిగా స్థిరపడ్డానని లక్ష్యం పట్ల పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏదైనా సాధించగలరని ఆమె విద్యార్థులకు స్ఫూర్తి నింపారు. పదో తరగతి అనంతరం వివిధ విద్య అవకాశాలను వినియోగించుకునే విధానాన్ని ఆమె విద్యార్థులకు వివరించారు. ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి మళ్ళీ తిరిగి ప్రయోజకురాలు అయిన తర్వాత ఇదే పాఠశాలకు డాక్టరుగా వచ్చి విద్యార్థులకు స్పూర్తి నింపడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story