సమిష్టి బాధ్యతతో అవినీతిని అరికట్టాలి : సీఐ అప్పయ్య

by Ratna Kumari |

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజలంతా సమిష్టి బాధ్యతతో అవినీతిని అరికట్టాలని, నిజాయితీ సంస్కృతిని పెంపొందించాలని వన్ టౌన్ సీఐ అప్పయ్య అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా

సమిష్టి బాధ్యతతో అవినీతిని అరికట్టాలి : సీఐ అప్పయ్య
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజలంతా సమిష్టి బాధ్యతతో అవినీతిని అరికట్టాలని, నిజాయితీ సంస్కృతిని పెంపొందించాలని వన్ టౌన్ సీఐ అప్పయ్య అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా శుక్రవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశం,రాష్ట్రాల అభివృద్ధికి అవినీతి పెద్ద అవరోధంగా మారిందని, అవినీతి నిర్మూలన కోసమే విజిలెన్స్ ఏర్పడిందని, అవినీతి , దుష్ప్రభావాల గురించి, పారదర్శక పాలన కోసం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. అంతకుముందు విద్యార్దులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి ఆయన బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులచే సిటిజన్ ప్రతిజ్ఞ చేయించి 'వాగ్ధాన్' నిర్వహించారు.

Next Story