- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్యాంక్ బండ్ పై నిర్మాణాలు.. బఫర్ జోన్ అంటూ స్టే..!
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్యాంక్ బండ్ నిర్మాణాలు బఫర్ జోన్ కిందకి వస్తుందని కోర్టు నుంచి స్టే రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. కుంటలు, రిజర్వాయర్ లు బఫర్ జోన్లను ఎలా లెక్కిస్తారో రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ డ్రాయింగ్ మ్యాప్ తో కోర్టు కు నివేదించడంతో న్యాయమూర్తి స్టే ఎత్తేశారు.

దిశ, మక్తల్ : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్యాంక్ బండ్ నిర్మాణాలు బఫర్ జోన్ కిందకి వస్తుందని కోర్టు నుంచి స్టే రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. కుంటలు, రిజర్వాయర్ లు బఫర్ జోన్లను ఎలా లెక్కిస్తారో రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ డ్రాయింగ్ మ్యాప్ తో కోర్టు కు నివేదించడంతో న్యాయమూర్తి స్టే ఎత్తేశారు. దీంతో ట్యాంక్ బండ్ పై నిర్మాణం, సుందరీకరణ పనులు ప్రయాణికుల కోసం రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు నిర్మాణం కొనసాగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పనులు ఆపాలనే ఉబలాట చెరువులో రిజర్వాయర్లలో బఫర్ జోన్లను లెక్కించే విధానం తెలియక ప్రతిపక్షాల వాళ్లు కోర్టుకు వెళ్లారు. చీఫ్ ఇంజినీర్ బఫర్ జోన్ ను లెక్కించే విధానం పై వివరణ ఇస్తూ ఓ డ్రాయింగ్ మ్యాప్ ను హై కోర్టు న్యాయమూర్తికి నివేదిక మున్సిపాలిటీ ఇంజినీర్ డిపార్ట్ మెంట్ వాళ్లు కౌంటర్ దాఖలు చేయడంతో స్టే ని తొలగించి నిర్మాణ పనులు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పూర్వ పరాలు ఎలా ఉన్నాయంటే..?
మక్తల్ పట్టణం ద్వారా జాతీయ రహదారి వెళ్తున్నాం. ఈ మార్గంలో దూర ప్రాంతాలకు వాహన దారులు రాకపోకలు సాగిస్తున్నా ప్రయాణికులకు విశ్రాంతి, అల్పాహారం, టీ, కాపీ, టాయిలెట్లు.. దాదాపు మూడు కోట్ల రూ.70లక్షలతో ట్యాంక్ బండి పై సుందరీకరణ పనులతో పాటు జీ ప్లస్ వన్ తో మొత్తం 24 షాపుల పక్క భవన నిర్మాణంం పై భాగంలో విశ్రాంతి గదులు, గ్రౌండ్ ఫ్లోర్ లో యాత్రికులకు అల్పాహార వసతి కల్పించడం ద్వారా.. మున్సిపాలిటీ ఆదాయ వనరుగా మారుస్తుందని.. జాతీయ రహదారి పక్కన విలువైన స్థలః అన్యాక్రాంతం కాకుండా దూరదృష్టితో మంత్రి వాకిటి శ్రీహరి దాదాపు నాలుగు కోట్లు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టారు.
స్టే ఎత్తేసిన హైకోర్టు
గ్రీనరితో మక్తల్ పట్టణానికి ఎంట్రన్స్ లో సుందరంగా వసతితో కూడుకున్న భవనాలతో చూపరులకు ఆకర్షించి మక్తల్ పై మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మంత్రి నిధులు మంజూరు ప్రోత్సాహంతో మున్సిపాలిటీ పనులు చేపట్టారు. మక్తల్ అభివృద్ధి నచ్చని కొందరూ ప్రతిపక్ష నాయకులు బఫర్ జోన్ లో భవన నిర్మాణం చేయరాదని కోర్టులో స్టే వేయడం జరిగింది. దీంతో కొద్ది రోజులు పనులకు ఆటంకం కలిగింది. బఫర్ జోన్ ఎలా లెక్కిస్తారనే దానిపై రాష్ట్ర నీటి పారుదల చీఫ్ ఇంజినీర్ అధికారులు లిఖిత పూర్వకంగా డ్రాయింగ్ మ్యాప్ తో వివరణ ఇచ్చారు. చెరువు ముందు భాగంలో బఫర్ జోన్ పరిగణలోకి రాదని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు నివేదికను కోర్టుకు సమర్పించడంతో ప్రతిపక్షాలు వేసిన స్టే తొలగిపోయిందని మక్తల్ మున్సిపాలిటీ నీటిపారుదల శాఖలో పని చేస్తున్న ఓ సీనియర్ ఇంజినీర్ తెలిపారు. మున్సిపాలిటీలో నిర్మాణం పనుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా అభివృద్ధి పనులను ఆపడం సరైన పద్దతి కాదని.. బఫర్ జోన్ అంటే దేనిని పరిగణిస్తారు అని తెలియకుండా ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి భంగపడటంతో పాటు వారికి చెంపపెట్టుగా మారింది. మున్సిపాలిటీలో పరుగులు చర్చించుకుంటున్నారు.






