క‌మీష‌న్ల కోస‌మే పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం : ఎంపీ మ‌ల్లు ర‌వి

by Ratna Kumari |

పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్ ను కేవలం కమీషన్ల కోసమే నిర్మాణం చేపట్టి అందినంత దోచుకుంటున్నారే తప్ప.. భూములు కోల్పోయిన ఆయా గ్రామాల ప్రజల గోడును పట్టించుకోలేదని నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు.

క‌మీష‌న్ల కోస‌మే పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం : ఎంపీ మ‌ల్లు ర‌వి
X

దిశ‌, రేవ‌ల్లి : పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్ ను కేవలం కమీషన్ల కోసమే నిర్మాణం చేపట్టి అందినంత దోచుకుంటున్నారే తప్ప భూములు కోల్పోయిన ఆయా గ్రామాల ప్రజల గోడును పట్టించుకోలేదని స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. మంగళవారం కొంకలపల్లి ముంపు బాధితులకు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి కలిసి ఇళ్ల‌ స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారే తప్ప ప్రాజెక్టు నిర్మాణంవల్ల వనపర్తి నియోజకవర్గానికి చుక్కనీరు అందక పొడవడం దురదృష్టకరమన్నారు. ఉన్న ఇంటిని బ్రతుకుతెరువు నడుపుతున్న వ్యవసాయ పొలాలతోపాటు సర్వం ప్రాజెక్టులో కోల్పోయి బతుకు దీనంగామారి ఆయా గ్రామాల ప్రజలు 10 సంవత్సరాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని. అందులో కొందరు మృత్యువాత పడ్డారని అలాంటి వారిని కూడా పట్టించుకోని గత పాలకులు నేడు ప్రగల్బలు పలకడం విడ్డూరమన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతన్నలకు నష్టపరిహారం,ఇండ్లు కోల్పోయిన వారికి సైతం ఇంటి స్థానం పట్టాలు అందజేసి ఆదుకుంటుందని వారు పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఆ గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్ నాగయ్య, నాయకులు మాండ్ల కురుమయ్య, చరణ్ పాల్గొన్నారు.

Next Story