ఐకాన్ బ్రిడ్జీ నిర్మాణం.. ప‌రిశీలించిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

by Ratna Kumari |

దిశ‌, కొల్లాపూర్ : తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ సోమశిల వద్ద కృష్ణా నది పై రెండు కొండల మ‌ధ్య‌ రూ, 1083 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఐకాన్ తీగల వంతెన ప్రాంతాన్ని శుక్రవారం

ఐకాన్ బ్రిడ్జీ నిర్మాణం.. ప‌రిశీలించిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్
X

దిశ‌, కొల్లాపూర్ : తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ సోమశిల వద్ద కృష్ణా నది పై రెండు కొండల మ‌ధ్య‌ రూ, 1083 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఐకాన్ తీగల వంతెన ప్రాంతాన్ని శుక్రవారం మ‌ల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, అచ్చం పేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు సందర్శించారు. సోమశిల వీఐపీ ఘాట్ నుంచి ఆ పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులతో కలిసి టూరిజం లాంచీలో తీగల వంతెన నిర్మిత ప్రాంతాన్ని సంద‌ర్శించారు. నీటి నిల్వ సామ‌ర్థ్యం ఎంత? అని అడిగి తెలుసుకున్నారు. నది పై తీగల వంతెన నిర్మాణం వ్యయాన్ని గూర్చి ఆయన అడిగి తెలుసుకున్నారు. వంతెన నిర్మిత కాల వ్యవధిని సైతం సుధాకర్ రావు ను ఈట‌ల‌ రాజేందర్ అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట బీజేపీ నాయకులు ధారాసింగ్, భీమేష్ రెడ్డి, సందు రమేష్, కృష్ణ, కాడం శ్రీనివాస్, ధనుంజయ గౌడ్ తదితరులున్నారు.

Next Story