ఛ‌లో ఖమ్మం బహిరంగ సభ ను జయప్రదం చేయండి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

by Ratna Kumari |

దిశ, తిమ్మాజీపేట : భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలనీ పిలుపునిచ్చిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ మాత్రమేఅని కామ్రేడ్ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శ‌తాబ్ది ఉత్సవాల ముగింపు

ఛ‌లో ఖమ్మం బహిరంగ సభ ను జయప్రదం చేయండి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
X

దిశ, తిమ్మాజీపేట : భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలనీ పిలుపునిచ్చిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ మాత్రమేఅని కామ్రేడ్ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శ‌తాబ్ది ఉత్సవాల ముగింపు ఉత్సవాలు సోమవారం మండల కేంద్రంలో సీపీఐ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి మన దేశానికి విముక్తి కొరకు విరచితమైన పోరాటాలు చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వ ఆగ్రహానికి గురై.. ఆనాడు నిషేధానికి గురైన సీపీఐ నేతలపై కాన్పూర్ మీరట్ పెషావర్ తదితరాల కుట్ర కేసులు పెట్టి అనేక మంది నాయకులు జైల్లో నిర్బంధించారన్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఈ దేశ స్వాతంత్ర‌ ఉద్యమంలో అన్ని వర్గాల‌ ప్రజలను సమీకరించి పోరాటం చేసిన పార్టీ సీపీఐ అన్నారు. భారతదేశం లో సీపీఐ సిద్ధాంతాలను అనుసరిస్తూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి నడుస్తున్న ఏకైక పార్టీ అంటే అది సీపీఐ పార్టీ అని కొనియాడారు. పేద వర్గాల బడుగు బలహీన వర్గాల ప్రజా పోరాటంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుందని తెలిపారు. చలో ఖమ్మం బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు పిలుపునివారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏం బాల నరసింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండి ఫయాజ్, షేక్ ఖాజా మైనుద్దీన్, కామ్రేడ్లు ఇసాక్ ఉర్ రెహమాన్, యాదయ్య పాల్గొన్నారు.

Next Story