- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్
మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి.

దిశ, మక్తల్ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. అయితే 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మృతి చెందటంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో 15 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 1వ వార్డులో రాజశేఖర్ రెడ్డి 59 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు. 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి టప్ప కృష్ణయ్య 73 ఓట్లతో విజయం సాధించాడు. 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ 102 ఓట్లతో, 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి కావలి నరసింహ 384 ఓట్లతో విజయం సాధించాడు. 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేష్, 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కలాల్ శ్రీవిద్య, 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జట్ల అనిత 122 ఓట్లతో, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శైవి రెడ్డి 321 ఓట్లతో విజయం సాధించారు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ 38 ఓట్లతో, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నహీద బేగం 66 ఓట్లతో, 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రహీంపటేల్ 308 ఓట్లతో, 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మక్తల్ సరిత 36 ఓట్లతో, 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస 113 ఓట్లతో, 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ల సంధ్య 374 ఓట్లతో, 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అల్కూరి పావని 259 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో మక్తల్ మున్సిపాలిటీనీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 6వ వార్డుకు త్వరలోనే ఎన్నిక జరుగనుంది.






