బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ : ఇటిక్యాల మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధ‌ర్ రెడ్డి

by Ratna Kumari |

దిశ‌, ఎర్ర‌వ‌ల్లి : రిజర్వేషన్ ల అంశాల‌పై కాంగ్రెస్, బీజేపీ కపట రాజకీయాలు చేస్తూ బీసీలను మోసం చేస్తున్నాయని శుక్రవారం ఇటిక్యాల బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ స్నేహ

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ : ఇటిక్యాల మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధ‌ర్ రెడ్డి
X

దిశ‌, ఎర్ర‌వ‌ల్లి : రిజర్వేషన్ ల అంశాల‌పై కాంగ్రెస్, బీజేపీ కపట రాజకీయాలు చేస్తూ బీసీలను మోసం చేస్తున్నాయని శుక్రవారం ఇటిక్యాల బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందని మండిపడ్డారు. రేపు జరగబోయే బీసీ బంద్ కి మండలంలోని బీసీలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.

Next Story