- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడిసిన్ సీట్ సాధించిన శ్రీవాణి కి అభినందనలు
దిశ, జడ్చర్ల : డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంజడ్సీ చదువుతున్న కావాలి శ్రీవాణి ఒక వైపు కళాశాలకు రోజు వస్తూ నీట్ పరీక్షకు ప్రిపైర్ అయి మంచి ర్యాంక్

దిశ, జడ్చర్ల : డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంజడ్సీ చదువుతున్న కావాలి శ్రీవాణి ఒక వైపు కళాశాలకు రోజు వస్తూ నీట్ పరీక్షకు ప్రిపైర్ అయి మంచి ర్యాంక్ సాధించింది. దీంతో గద్వాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చేరింది. తన తండ్రి కావాలి నర్సింహులు ఇదే కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తు తన కుమార్తెకు మంచి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సుకన్య మా కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీట్ రావడం చాలా గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది సన్మానం చేసి విద్యార్థిని శ్రీవాణినీ, తండ్రి కావలి నర్సింహులును అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి సుకన్య, అధ్యాపకులు శ్రీనివాస్, రాఘవేంద్ర రెడ్డి, సులేమాన్, నర్మద, ప్రవీణ్, ఆంజనేయులు, రాజేశ్వరి, రూక్యబాను, పుష్పలత,తిరుపతయ్య తిమ్మప్ప పాల్గొన్నారు.






