జడ్చర్లలో వ్యాపారస్తులకు ఐటి అధికారుల నోటీసుల కలకలం

by Nallavelli.Anjaneyulu |

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఐటి అధికారుల నోటీసుల జారి కలకలం రేపింది. మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల పలు

జడ్చర్లలో వ్యాపారస్తులకు ఐటి అధికారుల నోటీసుల కలకలం
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఐటి అధికారుల నోటీసుల జారి కలకలం రేపింది. మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల పలు కంపెనీల్లో పలు వ్యాపార సముదాయాల్లో సోదాలు చేస్తుండగా జడ్చర్ల మున్సిపాలిటీలో మాత్రం ఐటీ అధికారులు సుమారు 15 మంది వ్యాపారస్తులకు రూ.100 కోట్లకు పైగా ఫైన్ విధిస్తూ నోటీసులు జారీ చేయడం..? కలకలం రేపింది. అందులో కొందరికి ఒక్కొక్కరికి 5, 9, 11, 15 కోట్ల వరకు ఫైన్ విధించినట్లు ? సమాచారం కాక ఈ వ్యాపారులు అంతా మున్సిపాలిటీలో నిత్యం కోట్ల రూపాయల జీరో బిజినెస్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఐటి అధికారులు భారీ మొత్తంలో ఫైన్ విధిస్తూ నోటీసులు జారీ చేశారని పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఐటి అధికారులు జడ్చర్ల పట్టణంలోని వ్యాపారులకు 100 కోట్లకు పైగా ఫైన్..? విధిస్తున్నట్టు నోటీసులు జారీ చేయడంతో జడ్చర్ల పట్టణంలో ఏ స్థాయిలో జీరో నడుస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి వ్యాపారులు ఏ స్థాయిలో గండి కొడుతున్నారు. అర్థం చేసుకోవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ఐటి అధికారుల నోటీసుల జారిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story