- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా భద్రత కోసమే కమ్యూనిటీ పోలీసింగ్
ప్రజల భద్రత కోసం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రజల భద్రత కోసం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. బుధవారం రాత్రి ఆమె మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లి గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి,గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే,జరగడానికి ముందే దాన్ని నిరోధించడం దీని ముఖ్యఉద్దేశం అని అన్నారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని,హెల్మెట్ వాడకం,మద్యం సేవించకుండా,సీటు బెల్టు ధరించి వాహనం నడపడం,పరిమితి వేగం లాంటి అనేక భద్రతలు పాటిస్తూ వాహనాన్ని నడిపినప్పుడే ప్రమాదాలు జరగవని ఆమె సూచించారు.
అలాగే బాల్యం వివాహాలు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయని, అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాకనే వివాహాలు చేయాలని,అప్పుడే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఆవశ్యకతను,సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం గురించి క్లుప్తంగా వివరించారు. జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఎస్పీ జానకి భరోసానిచ్చారు.






