- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ మున్సిపాలిటీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మక్తల్ మున్సిపాలిటీని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటివరకు కొనసాగిన పలు రకాల పనులను మున్సిపల్ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.

దిశ, మక్తల్: మక్తల్ మున్సిపాలిటీని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటివరకు కొనసాగిన పలు రకాల పనులను మున్సిపల్ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిర్వాహణ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పకడ్బందిగా నిర్వహించేందుకు మక్తల్ తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రమేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు ముగ్గురు అధికారులు ఎన్నికల పనులను సమర్థవంతంగా సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ తో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో బ్యాలెట్ బాక్స్ లను సిద్ధంగా ఉంచుకోవాలని.. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ వద్ద పోలింగ్ బాక్సులు ఉన్నాయని.. వాటిని మున్సిపల్ కమిషనర్ సేకరించి పెట్టుకోవాలని సూచించారు. మక్తల్ లో 16 వార్డులకు సంబంధించిన ఓటర్ లిస్ట్ ను మున్సిపాలిటీలో ఉన్న ఓటర్ లిస్ట్ ను మున్సిపాలిటీలో ఉన్న ఓటర్లు వివరించు వివరిస్తూ దానికి సంబంధించిన నోటిఫికేషన్ పేపర్లను పోటీ చేసే అభ్యర్థులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ చర్చించారు.






