ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం పై క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, బిజినేపల్లి : మండలంలోని మంగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిక‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత, రికార్డు

ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం పై క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ..!
X

దిశ, బిజినేపల్లి : మండలంలోని మంగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిక‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత, రికార్డు నిర్వహణపై కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సదుపాయాలు, సిబ్బంది ప్రవర్తన, వైద్య సేవల నాణ్యతపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య సేవల కొరకు వచ్చే ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, విధులకు సంబంధించి సమయపాలనను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

ప్రజలకు అందించే ఆరోగ్య సేవలు నాణ్యంగా ఉండాలని, పీఎచ్‌సీల్లో ఎలాంటి నిర్లక్ష్యం వ‌హించ‌రాద‌ని స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులకు ఇవ్వాల్సిన వైద్య సేవలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అత్యవసర మందుల నిల్వ, ల్యాబ్ పరీక్షలు, స్టాఫ్ డ్యూటీ రోస్టర్ వంటి అంశాలను, ఆసుపత్రి ప్రాంగణాన్ని మరియు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తద్వారా రోగులకు మరియు సందర్శకులకు మెరుగైన వాతావరణం లభిస్తుందని కలెక్టర్ సూచించారు. సేవలలో లోపాలు ఏమైనా కనిపిస్తే వెంటనే సరిచేసుకోవాలని, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ చెప్పారు. స్థానికుల నుంచి ఆరోగ్య కేంద్రం పనితీరుపై అభిప్రాయాలను తెలుసుకొని, అవసరమైన మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో లోపాలు ఉంటే తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Next Story