కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి రాక

by Ratna Kumari |   (  Updated:2025-10-01 16:45:51  IST  )

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన సొంత ఊరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం

కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి రాక
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన సొంత ఊరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి రానున్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా , వృత్తిపరంగా వివిధ ప్రాంతాలలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దసరా పండగకు వారి సొంత ఊరు కొండారెడ్డి పల్లి గ్రామానికి చేరుకొని ఉమ్మడిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో గత ఏడాది సొంత ఊరుకి వచ్చి కుటుంబ సభ్యులు.. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్న విషయము పాఠకులకు విధితమే. ఈ ఏడాది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రెండవసారి తన సొంత ఊరుకు రానున్నారు. ఈ మేరకు కొండ రెడ్డి పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాలలో అగ్రగామిక నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో కొండారెడ్డిపల్లి గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం జమ్మి పూజ చేస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు ఆయన కొడంగల్ బయలుదేరి వెళ్లి రాత్రి అక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ , కేవీయన్ రెడ్డి పరిశీలించారు.

Next Story