- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధిపత్య కుల ధోరణితో వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో బహుజన కులాలు రాజకీయంగా ఎదగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు.

దిశ, ధన్వాడ : రాష్ట్రంలో బహుజన కులాలు రాజకీయంగా ఎదగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో బీఎస్పీ తరపున గెలుపొందిన బీసీ బిడ్డ గూదె వెంకటేష్ గారిని కాంగ్రెస్ నాయకులు బలవంతంగా తీసుకెళ్లిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఆధిపత్య కుల ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని,అందుకు నిదర్శనమే ఆలియాబాద్ ఘటన అన్నారు. కౌంటింగ్ కేంద్రం నుండి బీఎస్పీ కౌన్సిలర్ ను బలవంతంగా తీసుకెళ్తుంటే అక్కడే ఉన్న పోలీసులు అతనికి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. దొరల రాజ్యంలో దొరలకే పోలీసు వ్యవస్థ కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో భారత రాజ్యాంగం కాకుండా రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు. బహుజన కులాల ను అణచి వేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత బీఎస్పీ తీసుకుంటుందని హెచ్చరించారు.






