ఎమ్మెల్యే స్వాగతంలో పిల్లల భద్రతా మర్చిపోయిన ఘటన

by Ratna Kumari |

మండల కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్‌లో 15 ఫైనాన్స్ నాబార్డ్ కింద అదనపు గదుల నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాజరయ్యారు.

ఎమ్మెల్యే స్వాగతంలో పిల్లల భద్రతా మర్చిపోయిన ఘటన
X

దిశ, శ్రీరంగాపూర్‌ : మండల కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్‌లో 15 ఫైనాన్స్ నాబార్డ్ కింద అదనపు గదుల నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలు 36 డిగ్రీల ఎండ వేడిలో భూమి మీద కూర్చోని ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే నుంచి పిల్లలపై ఎలాంటి ప్రత్యేక ఆందోళన లేకపోవడం, పిల్లలు కూర్చోడానికి టీచర్లు కూడా ముందుగానే ఏర్పాటు చేయకపోవడం తల్లిదండ్రులలో ఆగ్రహానికి కారణమైంది. పిల్లలు ఎండలో కూర్చోగా ఏమైనా జరిగితే ఎవరూ బాధ్యత వహించరా?అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల కాళ్ళ కింద కార్పెట్లు ఏర్పాటు చేసినా, పిల్లలకు ఏ సౌకర్యం లేకపోవడం స్థానికవర్గాల వారిలో ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది తల్లిదండ్రులు, మా పిల్లలను ఇలాంటి పరిస్థితిలో చూసి మనసు ఆవేశానికి వస్తోంది. స్కూల్ నిర్వాహకులు, టీచర్లు, ఎమ్మెల్యే ఎవరు దయ చూపుతున్నారు.? అని గుసగుసలాడుతున్నారు. స్కూల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పిల్లల భద్రతకు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక వర్గాలు వాపోతున్నారు.

Next Story