బాట విష‌యంలో గొడ‌వ‌.. ముగ్గురి పై కేసు న‌మోదు

by Ratna Kumari |

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఓ బాట విషయంలో గొడవపడి ముగ్గురి పై కేసు నమోదైన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

బాట విష‌యంలో గొడ‌వ‌.. ముగ్గురి పై కేసు న‌మోదు
X

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఓ బాట విషయంలో గొడవపడి ముగ్గురి పై కేసు నమోదైన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై జగన్మోహన్ వివరాల ప్రకారం.. మహేష్ అలాగే వెంకటేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు రాజు హోటల్లో భోజనం చేస్తుండగా పక్కనే ఉన్న వారి సొంత పాలివారు అయినా ముగ్గురితో ఓ బాట విషయంలో తగవు జరిగింది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు మహేష్ అన్న అయినా వెంకటేష్ పై కుర్చీతో దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. వెంటనే తమ్ముడు మహేష్ చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలించాడు. తమ్ముడు మహేష్ ఫిర్యాదు మేరకు ఆంజనేయులు, బాలరాజు, చిన్న రాయుడు పై కేసు నమోదు అయిందని గోపాల్ పేట‌ ఎస్సై జగన్ మోహ‌న్ తెలిపారు.

Next Story