కుర్చేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న కేసీఆర్ కు కుర్చీ దొరకలేదా..?

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-04-04 09:05:40  IST  )

కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేస్తానన్న కేసీఆర్ కు ఇక్కడ కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేయడానికి కుర్చీ దొరకలేదా అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు.

కుర్చేసుకొని  ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న కేసీఆర్ కు కుర్చీ దొరకలేదా..?
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేస్తానన్న కేసీఆర్ కు ఇక్కడ కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేయడానికి కుర్చీ దొరకలేదా అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాకు ఏమీ చేయని హరీశ్ రావు శుక్రవారం విహారయాత్ర తరహాలో జిల్లాకు వచ్చి కొడంగల్, మక్తల్ ప్రాజెక్టుల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోయాడని ఆయన విమర్శించారు. మూడు సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై లేదన్నారు. దాదాపు 10 సంవ‌త్స‌రాలు పాలించినా ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో ఆదర బాదరాగా వచ్చి ఒక్క పంపుతో నీళ్ళను వదలి ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని విమర్శించిన నీకు, గ్యారెంటీల అమలు, జరుగుతున్న అభివృద్ధి కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వంటివి అనేక సంక్షేమ పథకాలు కళ్లకు కనిపిస్తలేవా అని నిలదీశారు. 25 లక్షల మంది రైతులకు 22 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేశామని, రైతు భరోసా, బోనస్, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పేదలను ఆదుకున్నామని ఆయన వివరించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లా ప్రజలను మోసం చేసి ఏం మోహం పెట్టుకొని వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నావని, వరుస ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాలేదని ఆయన దుయ్యబట్టారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఫోటో షూట్ కోసం పాలమూరు ప్రాజెక్టు ను ప్రారంబించినట్లు నటించి ప్రజలను మోసం చేయడానికి చూశారని, అయినా ప్రజలు నమ్మలేదని ఆయన విమర్శించారు. త్వ‌ర‌లోనే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల పాదాలు తడుపుతామని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఈ సమావేశంలో ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత, సిరాజ్ ఖాద్రీ, చంద్రకుమార్ గౌడ్, సిజె బెనహర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story