- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > నిబంధనలు పాటించని డీలర్ల లైసెన్సులు రద్దు : కలెక్టర్ బాదావత్ సంతోష్
నిబంధనలు పాటించని డీలర్ల లైసెన్సులు రద్దు : కలెక్టర్ బాదావత్ సంతోష్
by Ratna Kumari |
నిబంధనలు పాటించని డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

X
దిశ, నాగర్ కర్నూల్ : నిబంధనలు పాటించని డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,848 టన్నుల యూరియా నిల్వ ఉందని, రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు అన్నారు. ఈ యాసంగి లో రైతులు 1.2 లక్షల ఎకరాల మొక్కజొన్న సాగు సాగు చేస్తున్నారు. నేటికి జిల్లాలో 17,242 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మరో 25 వేల టన్నుల యూరియా అవసరం ఉంది. సోమవారం నుండి వివిధ రైలు మార్గాల ద్వారా జిల్లాకు యూరియా చేరుతుంది.రైతులు యూరియా గురించి ఆందోళన చెందకుండా అవసరం మేరకు ఉపయోగించాలని సూచించారు.అధికారులు, డీలర్లు ఆదేశాలు పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్క రైతుకు యూరియా సకాలంలో అందేలా చూడాలని చెప్పారు.
Next Story






