- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ పరిధిలోని అంతిరెడ్డిపల్లి లో ఆదివారం చోటు చేసుకుంది.

దిశ, వెల్దండ : తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ పరిధిలోని అంతిరెడ్డిపల్లి లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజిలాపూర్ గ్రామ పరిధిలోని అంతిరెడ్డిపల్లికి చెందిన గోరటి అలివేలు తన ఇంటికి ఫిబ్రవరి 27న తాళం వేసి హైదరాబాద్ లోని తమ కుమారుడి వద్దకు కి వెళ్లింది. ఇంటికి తిరిగి ఆదివారం మధ్యాహ్నం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటం గమనించి లోనికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో తన కోడలు చీరలో దాచిన ఉన్న అర్ధ తులం బంగారంతో పాటు, రెండు వెండి మొలతాడులు, రూ. 10 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని పోయారు. వాటి మొత్తం విలువ రూ. 1లక్ష 50వేల నష్టం వాటిల్లిందన్నారు. బీరువాలో ఉన్నటువంటి బట్టలను తగులపెట్టారు. దీంతో వెల్దండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు.






