గొల్ల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ విష‌యంలో బీఆర్ఎస్ తెర‌చాటు రాజ‌కీయాలు

by Ratna Kumari |

వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

గొల్ల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ విష‌యంలో బీఆర్ఎస్ తెర‌చాటు రాజ‌కీయాలు
X

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో ఉమ్మడి మండలాల అధ్యక్షుడు సత్యశీల‌ రెడ్డి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు1100 కోట్లతో నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ భూములు కోల్పోయే రైతులకు నాడు బిఆర్ఎస్ ప్రకటించిన నష్టపరిహారం కంటే ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపింది. గొల్లపల్లి రిజర్వాయర్ తో పాటు మరో 20 రిజర్వాయర్ల ఏర్పాటుకు 2016 లోనే జీవోలు జారీ చేసిన విషయం మరిచి నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్నీ సహించలేని కొందరు నీతిమాలిన రాజకీయ నాయకులు ప్రాజెక్టును వద్దంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి 21/10/2016 లో నాటి ప్రభుత్వం GO NO 941 జారీ చేసింది. ఇందుకు సంబంధించి సర్వేలన్నీ పూర్తి అయిన తర్వాత 26/2/ 2018 లో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు 6 లక్షల 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు కూడా ఆనాటి ప్రభుత్వం ముందుకు వచ్చింది.నేడు అదే గొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడానికి సహించలేని కొందరు నీతిమాలిన నాయకులు ప్రాజెక్టు నిర్మాణం వద్దంటూ స్థానిక నాయకులతో ధర్నాలు చేస్తూ తెరచాటు రాజకీయాలకు తెర లేపారు.

ఈ రిజర్వాయర్ నిర్మాణంతో వనపర్తి నియోజకవర్గంలోని 42,663 ఎకరాలకు సాగు నిరందుతోంది. ఈ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఆరు లక్షల 50 వేల రూపాయల నష్టపరిహారం మాత్రమే ప్రకటించింది.కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కొడంగల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో కోల్పోయిన రైతులకు ఇచ్చిన నష్టపరిహారం కంటే కొంత ఎక్కువ ఇచ్చేందుకే ముందుకు వచ్చింది. ఎకరాకు 20 లక్షలకు పై మాటే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేదని నాటి నిపుణుల బృందం తేల్చి చెప్పింది.పాలమూరు రంగారెడ్డి తో చుక్క నీరు రాదు. లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన పాలమూరు రంగారెడ్డి నిర్మాణం ద్వారా చుక్క నీరు వనపర్తి నియోజకవర్గానికి రాకపోవడం హాస్యాస్పదం అన్నారు. ప్రాజెక్టులు కట్టినమని ప్రగల్బాలుపలికే నాయకులు ఇందుకు సమాధానం చెప్పాలి. వేల కోట్లు కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు తీసుకున్న నాయకులు ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఎందుకు విఫలమయ్యారు సమాధానం చెప్పాలి. నాడు కాలేశ్వరం ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేసే సమయంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు మరిచిపోతున్నారని ప్రశ్నించని నాయకులు నేడు గొల్లపల్లి రిజర్వాయర్ పై గగ్గోలు పెట్టడం విడ్డూరం.గ్రామాల్లోని అమాయక ప్రజలతో ధర్నాలు చేయించడం ఇతర చాటు రాజకీయాలు చేయడం లాంటి ఎన్ని కుయుక్తులు చేసిన రిజర్వాయర్ నిర్మాణం ఇక్కడ తప్పకుండా జరిగి తీరుతుంది అన్నారు.

వనపర్తి నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని నాయకులు పేర్కొన్నారు. దమ్ముంటే ధర్నా చేసే బీఆర్ఎస్ నాయకులు వారి నాయకుడిని ఇక్కడికి పిలిపించి అడగండి రిజర్వాయర్ నిర్మాణం కమీషన్ల కోసమా రైతుల కోసమా మీరు మంజూరు చేయించింది. రైతుల కోసం అంటే కొనసాగిద్దాం కమిషన్ల కోసం అంటే క్షమాపణ చెప్పమనండి వదిలేద్దాం. వీటితోపాటు గోపాల్పేట చెరువును కూడా రిజర్వాయర్ చేద్దామను కున్నారు.అప్పుడు నోరు మూసుకున్న నాయకులు ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నారు.నాటి నీళ్ల నాయకుడు వారి కార్యకర్తలను మీరు వ్యతిరేకించోద్దని ఆనాడు. భయపెట్టాడు లేదంటే పోలీసుల బందోబస్తుతో అడ్డుగట్ట వేస్తామని బెదిరించాడు. మరి నేడేందుకు నీతిమలిన రాజకీయాలు చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాడల పర్వతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్యుత రామారావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొంకి వెంకటేష్,రేవల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జమ్మి మల్లేష్, గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అనసూయ, చీర్కపల్లి గ్రామ సర్పంచ్ రవి, పోలికేపాడు సర్పంచ్ నక్క బంగారయ్య యాదవ్, ఉప సర్పంచ్ జంపన్న, తాడిపర్తి సర్పంచ్ లోకా రెడ్డి,ఉప సర్పంచ్ దేశి రామచంద్రయ్య యాదవ్, బండరాయి పాకుల సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ సుకుమార్ రెడ్డి పాతతాండ గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్,గోపాల్ పేట టౌన్ అధ్యక్షుడు శివన్న,పార్టీ నాయకులు భాస్కరరావు,శాంతయ్య,సురేష్ గౌడ్,శేఖర్ రావు,పార్టీ నాయకులు ఎక్కే వెంకటేష్,గౌండ్ల నరసింహ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుకేందర్ రెడ్డి, సురేందర్, మెడికల్ రాజు పాల్గొన్నారు.

Next Story