- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్
బీసీల సంక్షేమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విస్మరించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ విమర్శించారు. జి

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బీసీల సంక్షేమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విస్మరించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 2,69,588 కోట్ల బడ్జెట్ తో బీసీల సంక్షేమం కోసం 41,484 కోట్లలో కేవలం 25,419 కోట్లు మాత్రమేనని ఖర్చు చేసిందని విమర్శించారు. మొత్తం బడ్జెట్ లో పదేళ్లలో రైతు బంధు,ఇతర పథకాలకు సంబంధించి 81.668 కోట్లు కేటాయించి,3.95 శాతం ఖర్చు చేశారని,ఎంబీసీలకు సంబంధించి బీసీ కులాల కార్పొరేషన్ కు 3850 కోట్లు కేటాయించి 20 కోట్లు మాత్రమేనని ఖర్చు చేసిందని,కేసీఆర్ పాలనలో బీసీలకు స్వర్ణయుగమని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు.కుల గణన సర్వే ను తప్పు అని కేటీఆర్ అనడం సరికాదని,కేసిఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనకపోవడం బీసీలను అవమానించినట్లేనని ఆయన విమర్శించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించే బాధ్యతను బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు,ఆరుగురు ఎంపీలపై ఉందన్నారు. ఈ బిల్లుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,డీసీసీ ఉపాధ్యక్షులు చంద్రకుమార్ గౌడ్,మీడియా సెల్ కన్వీనర్ సిజె బెనహర్,బెక్కరి మధుసూదన్ రెడ్డి,అజ్మత్అలీ,రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






