'రైల్ వన్' యాప్ లో టికెట్ బుక్ చేసుకుంటే బోనస్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-06 16:50:23  IST  )

రైలు ప్రయాణానికి అన్ రిజర్వుడు టికెట్ల ను(జనరల్ టికెట్) 'రెల్ వన్' యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 3 శాతం బోనస్ తో క్యాష్ బ్యాక్ వస్తుందని రైల్వే కమర్షియల్ ఇన్సిపెక్టర్ యస్ఏ.ముక్తార్ తెలిపారు.

రైల్ వన్ యాప్ లో టికెట్ బుక్ చేసుకుంటే బోనస్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రైలు ప్రయాణానికి అన్ రిజర్వుడు టికెట్ల ను(జనరల్ టికెట్) 'రెల్ వన్' యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 3 శాతం బోనస్ తో క్యాష్ బ్యాక్ వస్తుందని రైల్వే కమర్షియల్ ఇన్సిపెక్టర్ యస్ఏ.ముక్తార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 'దిశ' తో ఫోన్ లో మాట్లాడుతూ, రైల్ ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ 'RailOne' అనే యాప్ ను ప్రవేశపెట్టిందని, ఈ యాప్ ను సెల్ ఫోన్ లోని 'ప్లే స్టోర్' ద్వారా ఇన్స్టాల్ చేసుకుని అనేక సౌకర్యాలు పొందవచ్చని ఆయన తెలిపారు. డిజిటల్ పేమెంట్ ద్వారా 3 శాతం డిస్కౌంట్, 'ఆర్ వ్యాలెట్' ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకుంటే 3 శాతం క్యాష్ బ్యాక్ వస్తుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా తమ సీటు ను టికెట్ ద్వారా రిజర్వేషన్ , టికెట్, ఫ్లాట్ ఫాం టికెట్ బుక్ చేసుకోవచ్చని, పిఎన్ఆర్ స్టాటస్, రైలు స్టేటస్ తెలుసుకోవచ్చని, రైల్ లో భోజనం కూడా ఆర్డర్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఇట్టి అవకాశాన్ని రైల్వే ప్రయాణికుల సద్వినియోగం చేసుకోని, మరింత సుఖ ప్రయాణాన్ని పొందగలరని ముక్తార్ విజ్ఞప్తి చేశారు.

Next Story