అన్ని రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలి : జాతీయ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు

by Ratna Kumari |

దిశ‌, శ్రీరంగపూర్ : అన్ని రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు పేర్కొన్నారు. ఆదివారం ముకుంద నాయుడు ఆధ్వర్యంలో

అన్ని రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలి : జాతీయ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు
X

దిశ‌, శ్రీరంగపూర్ : అన్ని రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు పేర్కొన్నారు. ఆదివారం ముకుంద నాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శ్రీ రంగనాయక ఆలయంలో బీసీ సంఘం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో మండల కమిటీ నియమించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీరంగపూర్ మండల అధ్యక్షుడు జి. విరాట్.. జాతీయ బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడుగా రాజేష్ ను నియమించినట్టు జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మండల పరిధిలోని బీసీల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో జరిగే భవిష్యత్ కార్యాచరణలో పాల్గొని బీసీల రిజర్వేషన్ల ప్రక్రియలో కీలకంగా పనిచేస్తూ బీసీ ప్రజానీకాన్ని చైతన్యం చేయాల‌ని కోరారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని.. ఆర్. కృష్ణయ్య ఎల్లపుడూ బీసీల కోసం పని చేస్తూఉంటారని అందరం కలిసి బీసీల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు, బీసీ నాయకులు విరాట్, రాజేష్, విష్ణు, చరణ్, శివ, రాము, శోభన్ బాబు, చందు పాల్గొన్నారు.

Next Story