- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమామహేశ్వరం క్షేత్రం వద్ద అయ్యప్ప స్వామి మహా పడి పూజ
ఉమామహేశ్వర క్షేత్ర బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం క్షేత్రంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

దిశ, అచ్చంపేట : ఉమామహేశ్వర క్షేత్ర బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం క్షేత్రంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భోగ మహేశ్వరం వద్ద అయ్యప్ప స్వాములు పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నల్లమల్ల ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఉమామహేశ్వర స్వామి క్షేత్రంను మరింతగా అభివృద్ధిని చేస్తున్నాం అని, త్వరలోనే ఆంజనేయ స్వామి దేవాలయానికి భూమి పూజ చేయనున్నామన్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారంగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవాలయ క్షేత్రాన్ని ప్రజా ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. దిగువన భోగ మహేశ్వరం వద్ద భక్తుల సౌకర్యార్థం కొరకు ఉచిత మంచినీటి వాటర్ ప్లాంట్, ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం లడ్డు కేంద్రాన్ని ప్రారంభించారు. ఉమామహేశ్వర కొండపైకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నూతనంగా బస్సులు ఏర్పాటు చేయడమైనదనీ భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్ బాత్రూంలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈనెల 16వ తేదీన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం లో జరిగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఉంటుందనీ భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, శ్రీనివాసరావు, సర్పంచ్ శివ, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, లచ్చు నాయక్, బిచ్య నాయక్, పాలకమండలి డైరెక్టర్లు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.






