ఆటో, టీవీఎస్ ఢీ.. ముగ్గురికి గాయాలు

by Ratna Kumari |   (  Updated:2025-10-18 14:15:56  IST  )

దిశ‌, మిడ్జిల్ : ఆటో, టీవీఎస్ లూనా ఢీ కొన‌డంతో ముగ్గురికి గాయాలైన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. జ‌డ్చ‌ర్ల ప‌ట్ట‌ణం స‌ర‌స్వ‌తి

ఆటో, టీవీఎస్ ఢీ.. ముగ్గురికి గాయాలు
X

దిశ‌, మిడ్జిల్ : ఆటో, టీవీఎస్ లూనా ఢీ కొన‌డంతో ముగ్గురికి గాయాలైన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. జ‌డ్చ‌ర్ల ప‌ట్ట‌ణం స‌ర‌స్వ‌తి కాల‌నీకి చెందిన కుటుంబ స‌భ్యులు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ఊరుకొండ మండ‌లం, ఊరుకొండ పేట ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యానికి ఆటో లో వెళ్తుండ‌గా.. మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు వ‌ద్ద గ్రామానికి చెందిన సీతారెడ్డి టీవీఎస్ లూనా పై అక‌స్మాత్తుగా వ‌చ్చాడు. దీంతో త‌ప్పించ‌బోయి ఆటో బోల్తా ప‌డింది. ఆటోలో ఉన్న సోనీ, ఆమె కొడుకు 15 నెల‌ల బాబు గాయ‌ప‌డ్డారు. టీవీఎస్ న‌డిపిన సీతారెడ్డి త‌ల‌కు గాయ‌మైంది. గాయ‌ప‌డిన వారిని స్థానిక ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

Next Story